నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా కొండెక్కి కూర్చున్న చికెన్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. సండే వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లల్లో మసాలా గుమగుమలాడాల్సిందే. ముఖ్యంగా సండే రోజు అందరికి అందుబాటులో ఉండే చికెన్ కూర లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం చికెన్ రేట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. 15 రోజుల క్రితం 250 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉన్న చికెన్ ధర ఇప్పుడు 160 రూపాయలు నుంచి 170 రూపాయల వరకు పలుకుతోంది. హైదరాబాద్ మహానగరం తో పాటు విశాఖ మరియు ఇతర కీలక ప్రాంతాలలో కిలో చికెన్ రేట్ 160 రూపాయలకు చేరింది. ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడం వల్ల రేట్లు భారీగా పడిపోయాయని వ్యాపారాలు చెబుతున్నారు.