ఏపీలో దారుణం…తాగొద్ధని చెప్పినందుకు భామ్మను హత్య చేసిన 16ఏళ్ల బాలుడు…!

-

ఒకప్పుడు వయసు మీద పడిన వాళ్ళు..కాయా కష్టం చేసుకునే వాళ్ళు ఆ కష్టం మర్చిపోయినందుకు మద్యం సేవించే వాళ్ళు. కానీ ఇప్పుడు 15 ఏళ్లు రాకముందే మద్యానికి బానిసలను అవుతున్నారు. చదువు పక్కన పెట్టి జల్సాలు చేస్తున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల బాలుడు తాగొద్దని చెప్పినందుకు తన భామ్మని హతమార్చాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం. వంగలపూడి గ్రామంలో చోటు చేసుకుంది.

పదోతరగతి బాలుడు మద్యానికి అలవాటు పడ్డాడు. అంతే కాకుండా స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు రావడం తో స్నేహితుడు నవీన్ తో కలిసి మద్యం సేవించాడు. దాంతో తన భామ్మ నాగమ్మ (73) ఇద్దరినీ మందలించింది. మద్యం మత్తులో ఇద్దరూ కలిసి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version