ఏపీలో అంతు చిక్కని వైరస్‌..40 లక్షల కోళ్లు మృతి !

-

ఏపీలో కలకలం. ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లాలో కోళ్లకు అంతుచిక్కని వైరస్‌ వచ్చింది. దీంతో రోజు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి కోళ్ళు. ఆరోగ్యంగా కనిపించే కోడి గంటల వ్యవధిలో మృత్యువాత పడుతున్నాయి. డిసెంబర్ లో మొదలైన ఈ వైరస్..జనవరి 13 తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో రోజు వేల కోళ్లు చనిపోతున్నాయి. శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ కారణంగా..తీవ్రంగా నష్టపోతున్నారు పౌల్ట్రీ రైతులు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50 శాతం రైతులు..తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మేత తినడం, గుడ్డు పెట్టిన కొద్ది సేపటికి మృత్యు వాత పడుతున్నాయి కోళ్లు. దీంతో బ్యాంకులకు బాకీలు కట్టలేక రోడ్డున పడుతున్నారు పౌల్ట్రీ రైతులు. వ్యాక్సిన్ వేస్తున్న ఉపయోగం సున్నా అంటున్నారు. 2012, 2020లో ఇదే తరహాలో వ్యాపించింది వైరస్. గతం కంటే వేగంగా వ్యాపిస్తోంది వైరస్. ఈ వైరస్ వ్యాప్తి కి కారణాలు తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. టెస్టుల నిమిత్తం కోళ్ళ బ్లడ్ శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు రైతులు. కోళ్లకి వైరస్ వ్యాప్తి ని విపత్తుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version