కీసర లో వ్యభిచార గృహం పై దాడి… ఇద్దరి అరెస్ట్…!

-

కీసర గోధుమ కుంట గ్రామపంచాయతీ పరిధిలోని టీఎస్ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ గృహం పై పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. గోదావరి ఖని కి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి హైదరబాద్ ఈసీఐఎల్ లో నివాసం ఉంటున్నాడు. అతడికి కీలస మండలం టీ ఎస్ కాలనీకి చెందిన అరుణకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గతం లో ఓ వ్యభిచార గృహాన్ని నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో కుమారస్వామి ఆన్ లైన్ లో డబ్బులు తీసుకుని మహిళలను పంపించేవారు.

దాంతో అతడి పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఇద్దరు మరోసారి వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడ్డారు. బంగ్లాదేశ్ దాకా కు చెందిన ఓ మహిళ కలకత్తా కు వచ్చి వీరిని ఆశ్రయించగా హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ కస్టమర్ వద్దకు మహిళను పంపే క్రమంలో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితులు అరుణ కుమారి… కుమారస్వామి నుండి కారు…రెండు సెల్ ఫోన్లు 4వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన మహిళ అనారోగ్యం తో బాధపడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version