కుక్క వల్ల గొడవ…ముగ్గురికి జీవిత ఖైదు..!

-

కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలు దారుణాలకు కారణం అవుతాయి. ఏకంగా హత్యలు దాడుల వరకు వెళతాయి. అలా దారుణాలకు పాల్పడిన తరవాత ఎదురయ్యే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. తాజాగా ఓ కుక్క వల్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. ఇప్పుడు ఆ హత్య చేసిన వారికి జీవిత ఖైదు శిక్ష పడింది. వివరాలలోకి వెళితే… హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పఠాన్ చెరు మండలం ఇంద్రేశం లో నివసించే ప్రశాంత్ అనే వ్యక్తి 2014లో ఓ కుక్కని పెంచుకున్నాడు.

ఆ కుక్క అదే ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళింది. దాంతో శ్రీనివాస్ ఆ కుక్కపై దాడి చేసి ఇంటి నుండి తరిమాడు. ఆ విషయం లో ప్రశాంత్ తో గొడవ జరిగింది. దాంతో ప్రశాంత్ శ్రీనివాస్ పై పగ పెంచుకున్నాడు. రామచంద్రాపురం కు చెందిన ప్రశాంత్, వినోద్ అనే మరో ఇద్దరి తో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి హత్య చేశాడు. ఆ సమయంలో శ్రీనివాస్ భార్య అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశారు. ఈ కేసులో 2014లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఇప్పుడు కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version