కార్మికులపై కూలిన స్టోన్ క్వారీ.. శిథిలాల కింద 15 మంది

-

మిజోరాంలో సోమ‌వారం సాయంత్రం స్టోన్ క్వారీ కూలిపోంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు క్వారీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. కార్మికులు మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి వ‌చ్చిన త‌ర్వాత ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 12 మంది కూలీల‌తో పాటు హిటాచి డ్రైవ‌ర్లు క్వారీ లోప‌ల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న‌య్‌థియాల్ జిల్లాలోని మౌద‌ర్హ్ అనే గ్రామంలో ఉన్న‌ ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర విప‌త్తు నివార‌ణ బృందాలతో పాటు స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాలు, అసోం రైఫిల్స్ రెస్య్కూ చేప‌ట్టాయి.

ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు చుట్టుప‌క్కల గ్రామాల నుంచి వాలంటీర్లు త‌ర‌లివ‌చ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ క్వారీలో రెండున్న‌ర ఏళ్లుగా ప‌నులు జ‌రుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version