దేశంలో రోజు రోజు దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఆరేండ్ల బాలుడి పై ఓ 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేసిన సంఘటన మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాలుడు ఏడుస్తూ.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి.. బాలుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక బాలుడి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు.. నిందితుడి పై కేసు నమోదు చేసారు పోలీసులు. అనంతరం ఆ నిందితున్ని అరెస్టు చేసి.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో.. నిందితున్ని కఠినం గా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.