వరంగల్‌ దారుణం..బాలికను గర్భవతిని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్పంచ్ ?

-

వరంగంల్‌ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ఊరి సర్పంచ్‌… కామంతో… ఓ దారుణానికి ఒడిగట్టింది. అభం శుభం తెలియని మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ సర్పంచ్‌. బాలిక గర్భం దాల్చడంతో… ఈ విషయం బయటపడింది. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి సర్పంచ్‌ పస్తం రాజు, పత్తి నాగరాజు అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక పై లైంగిక దాడి చేసిట్లు సమాచారం అందుతోంది.

బాలిక గర్భం దాల్చిందని తెలియడంతో… బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఊరి పెద్దలు, అలాగే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీఅ నేతలు రంగంలోకి దిగినట్లు కూడా సమాచారం అందుతోంది.

ఊరి చివర ఓ తోటలో బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ వ్యవహారం సెటిల్‌ మెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. ఈ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. ఇక ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version