ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకి చెందిన కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్స్ చదువుతుంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మాస్టర్స్ డిగ్రీని అందుకోనుంది. ఇంతలోనే విధి ఆమెను వక్రీకరించింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీ కొని ఈ ఏడాది ప్రారంభంలో మరణించింది.
టెల్ పోలీస్ డిపార్టుమెంట్ సమాచారం ప్రకారం.. మార్క్ చేయబడిన పెట్రోలింగ్ SUVని నడుపుతున్న అధికారి డక్సార్ట్ అవెన్యూ నార్త్ లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు. ఇక అదే సమయంలో మహిళ పాదచారి క్రాస్ వాక్ లో తూర్పు నుంచి పడమరకు దాటుతుండగా వాహనం ఆమెను ఢీ కొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది జాహ్నవి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. జాహ్నవి మరణించాక ఆమె మరణం గురించి ఓ అధికారి నవ్వుతూ.. సరదాగా మాట్లాడటం తన బాడీ కెమెరాలో రికార్డు కావడంతో సీటెల్ పోలీస్ యూనియన్ నాయకులపై దర్యాప్తు ప్రారంభించినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ వీడియోని విడుదల చేశారు. అందులో మిస్టర్ అడెరల్ అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ హృదయ విదారకరమైందంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వీడియోలో సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్, గిల్డ్ ప్రెసిడెంట్ తో కాల్ మాట్లాడుతూ.. శ్రీమతి కందులను సాధారణ వ్యక్తి అని పిలిచే ముందు.. ఆమె మరణించిందని నవ్వుతూ చెప్పగా. అతను నవ్వుతూ అవును ఓ చెక్కు రాయండి. 11వేల డాలర్లు అని పేర్కొన్నాడు. ఈ వీడియో పరంగా చూస్తే జాహ్నవి హత్య చేయబడిందా అనే అనుమానం వ్యక్తం కలుగుతుంది.