రేపు చంద్రబాబును కలువనున్న పవన్‌.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినే చంద్రబాబు అరెస్ట్‌ సంచలన రేపుతోంది. అయితే.. నిన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణి ములాఖత్‌ అయ్యారు. అయితే.. రేపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రేపు రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక మలుపు అని రఘురామ అభివర్ణించారు. ఆపదలో అండగా నిలిచేవాడే స్నేహితుడు అని ఉద్ఘాటించారు.

ఇదిలా ఉంటే.. కార్పోరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమాలు నిజమే అయితే బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా? అని నిలదీశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ తన నాలుగున్నరేళ్ల కాలంలో తమ పార్టీ అధినేతపై ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక కడుపు మంటతో రగిలిపోతున్నాడన్నారు. చివరకు ఆధారాలు లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లేక కుట్రపన్ను తప్పుడు కేసు పెట్టారన్నారు. దేశంలో మోడీ హయాంలో సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో మొదటగా మోడీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version