బెంగాల్ రైలు ప్ర‌మాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య‌

-

బెంగాల్ లోని దొమోహ‌నీ న‌గ‌రంలో వద్ద బిక‌నేర్ నుంచి గుహ‌వాటికి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్ర‌మాదానికి గురి అయిన విష‌యం తెలిసిందే. ఈ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య ఏడు కు చేరింది. అలాగే దాదాపు 45 మంది తీవ్రంగా గాయ ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం జ‌రిగ‌న స‌మ‌యంలోనే న‌లుగురు అక్క‌డి కక్క‌డే మృతి చెందారు. అలాగే మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో మ‌ర‌ణించార‌ని బెంగాల్ రైల్వే అధికార వెల్ల‌డించారు.

అలాగే ఈ ఘ‌ట‌న లో 45 మందికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని తెలిపారు. అందులో కొంత మంది పరిస్థితి విష‌మంగా ఉంద‌ని వెల్ల‌డించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ రైళ్లో మొత్తం 1053 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. కాగ గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు దొమోహ‌నీ వ‌ద్ద బిక‌నేర్ – గుహ‌వాటి ఎక్స్ ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. దీంతో మొత్తం 12 బోగీలు ప‌ట్టాలు త‌ప్ప‌యి. అందులో ఐదు బోగీలు పూర్తిగా ద్వంసం అయ్యాయి. ఈ ఐదు బోగీల‌లో ఉన్న‌వాళ్లు తీవ్రంగా గాయ ప‌డ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version