అగ్గిపెట్టెతో ఆడుకుంటూ నిప్పంటించుకున్న బాలుడి మృతి

-

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు అగ్గిపెట్టతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందాడు. అగ్గిపెట్టెతో ఆడుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న గడ్డికి నిప్పంటించాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న ఆ బాలుడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన మంగళవారం అర్ధరాత్రి కొరియా ప్రాంతంలో జరిగింది.

 

పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటూ.. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో పశువుల మేత కోసం గడ్డిని నిల్వ ఉంచారు. అయితే అగ్గిపెట్టెతో ఆడుకుంటున్న బాలుడు.. గడ్డికి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చేలరేగాయి. చిన్నారి ఏడుపు విన్న తల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version