ప్రముఖ తమిళ్ నటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె తెలుగులో కూడా నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఇందులో భాగంగానే పలు ప్రైవేటు , సినీ ఆల్బమ్స్ లో కూడా పాటలు పాడి తన గానంతో బాగానే ఆకట్టుకున్న మల్టీ టాలెంట్ నటి అని చెప్పవచ్చు.
కెరియర్ పరంగా తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత కొంతకాలంగా కాంట్రవర్సీ లతో బాగా పాపులర్ అయింది. ఇక ఈ క్రమంలోనే మొన్న మధ్య ఒక తమిళ్ ప్రముఖ సంగీత దర్శకుడు తో ప్రేమాయణం నడిపిందని.. ఇక తన ప్రియుడుతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలు కూడా సుచీ లీక్స్ పేరుతో బయటకు విడుదలయ్యాయి.
ఇక ఈ విషయంపై నటి ఆండ్రియా పేరు ఈ వివాదంలో బాగానే దుమారం లేపింది. కానీ ఈ విషయంపై ఆమె ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం కాస్త సర్దుమనిగింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆండ్రియా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తోంది.