డ్రగ్స్ తీసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై ఐటీ కంపెనీల వేటు… వారం వ్యవధిలో 13 మంది తొలగింపు

-

డ్రగ్స్ కేసులు దూకుడు పెంచారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జాబితా పోలీసుల చేతిలో ఉంది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను ఆయా కంపెనీలకు అందించారు. పోలీసులు ఇచ్చిన ఆధారాలతో ఐటీ కంపెనీలు ఆ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు వారం వ్యవధిలో 13 మంది ఉద్యోగులను తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు అందించినట్లు సమాచారం వస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి పలు కఠిన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులు వద్ద డ్రగ్ పెడలర్ల నుంచి పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమాచారం ఉంది. అమెజాన్, ఇన్ఫోసిస్, మహీంద్రా, క్యూ సాఫ్ట్ ఉద్యోగులను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. గత ఆరు నెలలుగా ఉద్యోగులు ఏయే పబ్ లకు వెళ్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీకెండ్ పార్టీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వీకెండ్ పార్టీలపై నజర్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version