ఈ మధ్య కాలంలో అతి జాగ్రత్త వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అధికారులు సూచిస్తున్నప్పటికీ వాటిని ఏవి లెక్కచేయకుండా రోడ్డు పై ప్రయాణం చేసే అతి జాగ్రత్తతో ప్రయాణించి పలువురు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
తాజాగా బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో రిక్షాను లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. లక్కీ సారాయి పట్టణం సమీపంలోని జాల్నా గ్రామం వద్ద బుధవారము తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన లో మరో ఆర్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వారిని పాట్నాలోని సరదా హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో రిక్షాలో 14 మంది ఉన్నట్టు తెలిపారు. అతివేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణను ప్రారంభించారు.