హైదరాబాద్ శివార్లలో రియల్టర్స్‌పై కాల్పులు..ఇద్దరు మృతి

-

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం కర్ణంగూడ శివారు వద్ద ఇవాళ ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. రియల్‌ ఎస్టేట్‌ కు సంబంధించిన గొడవకు సంబంధించి.. ఈ రోజు ఉదయం కాల్పులు జరిగినప్పుడే శ్రీనివాస్‌ రెడ్డి ఘటన స్థలంలోనే మృతి చెందగా.. కాసేపటి క్రితమే.. రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డి కలిసి ఇబ్రహీం పట్నం పరిధిలోని లేక్‌ వ్యూస్‌ కు సమీపంలో వెంచర్‌ వేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే… ఈ ఉదయం ఆ వెంచర్‌ లో బోర్‌ వేయించేందుకు ఇద్దరు వెళ్లినట్లు చెప్పారు.

ఆ సమయంలోనే శ్రీనివాస్‌ రెడ్డి, రాఘ వేందర్‌ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వారి సన్నిహితులు పేర్కొన్నారు. అయితే.. మట్లారెడ్డితో శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డికి వాగ్వాదంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ప్రస్తుతం ఇబ్రహీం పట్నం ఏసీపీ విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version