ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. చిన్నారితో స‌హా న‌లుగురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంల‌ని కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదంలో చిన్నారితో స‌హా మొత్తం న‌లుగురు మృతి చెందారు. జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద ఉన్న విజ‌య‌వాడ – హైద‌రాబాద్ – 65వ జాతీయ రాహ‌దారిపై కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్ ను ఢీ కొట్టింది. స్టానికులు గ‌మ‌నించ‌డంతో చిల్ల‌క‌ల్లు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

ప్ర‌మాదంలో స‌మ‌యంలో కారులో ఆరుగురు ప్ర‌యాణిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అందులో ముగ్గురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. కాగ ఒక చిన్నారికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆ చిన్నారి మృతి చెందింద‌ని వైద్యులు ధృవీక‌రించారు. కాగ ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రికి కూడా గాయాలు అయ్యాయి.

వారిని ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగ ఈ రోడ్డు ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణం అతి వేగ‌మేన‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version