గర్ల్‌ఫ్రెండ్‌ కోసం గ్యాంగ్‌ వార్‌… ఒకరి మృతి.. ఇద్దరు మైనర్లు అరెస్ట్‌

-

Gang war: ప్రేమించిన అమ్మాయి కోసం.. ప్రాణాలు తీయడం, తీసుకోవడం ఈరోజుల్లో చాలా కామన్‌ అయిపోయింది. మొన్నటిమొన్న హైదరాబాద్‌లో ఓ అమ్మాయి కోసం.. స్నేహితుడినే అతి కిరాకంగా హత్యచేశాడు ఓ యువకుడు.. ట్రై యాంగిల్‌ లవ్ స్టోరీస్‌ తెచ్చిన కుంపటి ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంది. తాజాగా దిల్లీలోనూ ఇలాంటిదే జరిగింది. తన ఎక్స్-గర్ల్ఫ్రెండ్ వేరే వ్యక్తితో రిలేషన్లో ఉందని తెలుసుకున్నాడు ఆ మైనర్. అతడిని బెదిరించాడు. తన స్నేహితులతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాడు. అతని స్నేహితులు కూడా వచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే ఒకరు మృతి..

 

Gang war

దక్షిణ ఢిల్లీ జాకిర్ నగర్లో నివాసముంటున్న అదీబ్కు ఓ గర్ల్ఫ్రెండ్ ఉంది. వారిద్దరు కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. అంతకుముందు.. ఆమెకు ఓ 16ఏళ్ల బాయ్ఫ్రెండ్ ఉండేవాడట… కొన్ని కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు. తన ఎక్స్-గర్ల్ఫ్రెండ్ మరో వ్యక్తితో రిలేషన్లోకి వెళ్లిందని తెలుసుకున్నాడు ఆ మైనర్ బాలుడు. రిలేషన్ను కట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అదీబ్ను హెచ్చరించాడు. మాటర్ను సెటిల్ చేసుకునేందుకు కలుద్దామని ఆ మైనర్కు చెప్పాడు అదీబ్. జాకిర్ నగర్ స్ట్రీట్ నెం.6లో కలిసేందుకు ప్లాన్‌ వేసుకున్నారు.

మైనర్ను కలిసేందుకు తన స్నేహితులు అఫ్జల్, శ్యాన్, మహమ్మద్ షేక్ జాఫర్, శ్యామ్లతో కలిసి వెళ్లాడు అదీబ్. బాలుడు కూడా తన స్నేహితులు సబీర్, 22ఏళ్ల తబీష్తో పాటు మరో మైనర్తో అక్కడికి వెళ్లాడు. ఇరు వర్గాల మధ్య వాదనలు పెరిగాయి. తీవ్రంగా గొడవపడ్డారు. ఇదే క్రమంలో తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీశాడు తబీష్. అదీబ్, అతని స్నేహితులను దారుణంగా పొడిచాడు. వారందరికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గాయపడిన వారిని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. శ్యాన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందించారు. చనిపోయింది అదీబ్‌ స్నేహితుడు.. పాపం ఇతని ఆ లవ్‌ మ్యాటర్‌తో ఏం సంబంధం లేదు. కేవలం ఫ్రెండ్‌కు తోడుగా ఆరోజు అక్కడి వెళ్లాడు అంతే..

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు ఢిల్లీ నుంచి పరార్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ హాపూర్, సియానాలో రైడ్స్ నిర్వహించి.. ఇద్దరు మైనర్లు (16ఏళ్లు) సహా తబీష్ అని అరెస్ట్ చేశారు. నేరానికి పాల్పడిన కత్తిని తబీష్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version