10 నిమిషాలు లేటయిందని.. విడాకులు ఇచ్చేశాడు

-

ట్రిపుల్ తలాక్ పై ఎంత చర్చ నడుస్తున్నా… కేంద్ర బిల్లు తీసుకొచ్చినా దాన్ని అడ్డం పెట్టుకొని తీసుకునే విడాకులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ట్రిపుల్ తలాక్ ఘటన ఒకటి బయటపడింది. కట్టుకున్న భార్య ఇంటికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.

బాధితురాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన నానమ్మను చూడటానికి పుట్టింటికి వెళ్లింది. అయితే.. పుట్టింటికి వెళ్లి వెంటనే ఇంటికి రావాలని భర్త కండీషన్ పెట్టాడు. ఆ మహిళ వెళ్లి నానమ్మను పరామర్శించి.. ఇంటికి తిరుగుప్రయాణమైంది. కాకపోతే.. ఓ 10 నిమిషాలు లేటుగా ఇంటికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన భర్త… ఆ మహిళ ఇంటికి రావడానికి ముందే ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే మళ్లీ పుట్టింటికి వెళ్లిన బాధితురాలు.. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. తల్లిదండ్రులతో భర్త దగ్గరికి బాధితురాలు వెళ్లగా.. ఆ భర్త భార్యను బయటికి గెంటేయడంతో.. తప్పని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లి అయినప్పటి నుంచి తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. ఎలాగైనా వదిలించుకోవాలని.. పుట్టింటికి వెళ్లి లేటుగా వచ్చానన్న సాకుతో తనకు ట్రిపుల్ తలాక్ చెప్పినట్టు బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version