బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అప్పటివరకు షటిల్ ఆడి కాసేపు అలా కూర్చున్నాడు. ఇంతలో ఏమైందో తెలీదు ఒళ్లంతా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ప్లేయర్లు అతన్ని లేపేందుకు ప్రయత్నించారు.
అనంతరం వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూడగా.. మృతుడిని సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అతని మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు నిర్దారించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.