శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

-

హైద‌రాబాద్ లోని శంషాబ‌ద్ లో గ‌ల రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం లో భారీ గా బంగారం పట్టుబ‌డింది. దుబాయ్ నుంచి హైద‌రాబాద్ కు వ‌స్తున్న న‌లుగురు సూడ‌న్ వాసుల‌ను ఎయిర్ పోర్ట్ లో ఉన్న క‌స్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. వీరి ద‌గ్గ‌ర నుంచి భారీ గా బంగారాన్ని ప‌ట్టుకున్నారు. వీరి ద‌గ్గ‌ర నుంచి రూ. 3.60 కోట్ల విలు చేసే 7.3 కిలో గ్రాముల బంగారాన్ని క‌స్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ బంగారాన్ని అక్ర‌మం గా హైద‌రాబాద్ కు తీసుకురావాల‌ని ఈ న‌లుగురు సుడాన్ వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. ఈ బంగారం కొంత భాగాన్ని పేస్ట్ రూపంలో కి మార్చి తీసుకువ‌చ్చారు. అలాగే మ‌రి కొంత భాగాన్ని గోల్డ్ బార్స్ గా మార్చి తీసుకువ‌చ్చారు. అయితే ఎయిర్ పోర్ట్ లో ఉన్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని క‌నిపెట్ట‌డం తో ఈ న‌లుగురిని ఆరెస్టు చేశారు. అంతే కాకుండా బంగారం ఎక్క‌డి కి త‌ర‌లిస్తున్నారని ద‌ర్యాప్తు కూడా చేస్తున్నారు. కాగ‌ ఈ న‌లుగురి లో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version