అమ్మానాన్న సంతోషంగా ఉండండి.. లేఖ రాసి విద్యార్థి సూసైడ్

-

‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. మీరు సంతోషంగా ఉండండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కథనం ప్రకారం.. ఏపీ కడప జిల్లా చిట్వేల్‌ మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(17) ఈనెల 8న మాదాపూర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందాడు. కొండాపూర్‌లోని హాస్టల్‌లో మరో ముగ్గురితో కలిసిఉంటూ చదువుతున్నాడు. ఈనెల 26న యూసుఫ్‌గూడలో ఉండే బంధువు ఇంటికి వెళ్లాడు. 28న మధ్యాహ్నం తిరిగి హాస్టల్‌కు వచ్చాడు.


అదే రోజు సా.6 గంటలకు ఆయన రూమ్‌మేట్లు చూడగా గది లోపలి నుంచి గడియ వేసి ఉంది. తాళాలు పగలగొట్టి చూడగా విద్యార్థి ఉరేసుకుని కనిపించాడు. కిందికి దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. గదిలో విద్యార్థి రాసినట్లు భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో ‘సారీ.. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టా.. ఇక మీదట ఎవరూ ఇబ్బంది పెట్టరు.. సారీ అమ్మా, నాన్న, ఇంకా మీరు చాలా సంతోషంగా ఉండాలి’.. అని ఉంది. అతడి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version