పుష్పక్ బస్సు: మూడు గంటలు ఉచితంగా ప్రయాణం.. తిరుమల కూడా..!

-

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పైగా కొత్త కొత్త ఆఫర్స్ ని కూడా తీసుకు వస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ ని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చి వెళ్లే వారికి ఈ ఆఫర్.

పుష్పక్ బస్సు సర్వీసులతో ఈ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. లక్కీ డిప్‌లను ఏర్పాటు చేసారు. వారానికి ఒకసారి ఈ లక్కీ డిప్ ద్వారా ముగ్గురును సెలెక్ట్ చేసి తిరుమలలో ఉచిత దర్శన అవకాశం ఇస్తారు. ప్రయాణికులు ఏం చెయ్యాలంటే పుష్పక్‌ లో ప్రయాణించాక టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి లక్కీ డిప్ బాక్సుల్లో వెయ్యాలి.

అలానే పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేసేవారు ఫేన్ పే, గూగుల్ పే మొదలైన వాటి ద్వారా టికెట్ చార్జీలు చెల్లించచ్చు. అంతే కాదు ఎయిర్‌పోర్టుకు వెళ్లి రావడానికి ఒకే సారి టికెట్ తీసుకుంటే 10 శాతం వరకు రాయితీ అదే ముగ్గురికి పైగా ప్రయాణిస్తే 20 శాతం రాయితీ ఇస్తారు.

శంషాబాద్ విమానాశ్రయంలో దిగాక సిటీకి అదే బస్సులో వస్తే మూడు గంటల పాటు అదే టికెట్‌ పై సిటీ బస్సుల్లో ఉచితంగా ట్రావెల్ చెయ్యచ్చు. 40 పుష్పక్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version