సింగర్ సిద్దు మూసేవాలా హంతకుల ఎన్కౌంటర్

-

ఈ ఏడాది మే 29న పంజాబ్లోని జవహర్కే అనే గ్రామంలో కాంగ్రెస్ నేత, సింగర్ సిద్దు మూసేవాలా ను దుండగులు దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మంది కి పోలీస్ సెక్యూరిటీని రద్దు చేసింది. అందులో సిద్దు మూసేవాల కూడా ఒకరు. అయితే సెక్యూరిటీ విత్ డ్రా చేసిన 48 గంటల్లోనే కాంగ్రెస్ నేత సిద్దు మూసేవాల హత్య జరిగింది.

ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.. బుధవారం తమకు తారసపడిన నిందితులను అరెస్టు చేసే యత్నం చేయగా.. పోలీసులపై నిందితులు కాల్పులు జరుపుతూ తప్పించుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిద్దు మూసే వాలా హంతకులలో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్ సింగ్ హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి ఓ ఏకే-47, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version