తెలంగాణకు విపత్తు సహాయ నిధులు కేంద్రం 3,000 కోట్లు ఇచ్చింది : కిషన్‌రెడ్డి

-

గత 8 సంవత్సరాలలో తెలంగాణకు విపత్తు సహాయ నిధుల 3,000 కోట్లు కేంద్రం విడుదల చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో 2018 నుండి ఇప్పటి వరకు1,500 కోట్లు విడుదల చేసిందని, టీఆర్‌ఎస్‌ 2018 నుండి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) కింద తెలంగాణకు ఎటువంటి సహాయం అందించడం లేదని మీడియాలో అనేక తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తప్పుడు వాదనలు చేస్తున్నారన్నారు కిషన్‌రెడ్డి. 2020 జీహెచ్ఎంసీలో వరదలు, 2022 గోదావరి వరదలు కానీ విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని, 2020-2021 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ లో వరదల సమయంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి సుమారు 599 కోట్లు ఇవ్వగా ఇందులో కేంద్రం వాటా 449 కోట్లు అని ఆయన తెలిపారు.

ఇది 2 విడతలుగా 224.50 కోట్ల చొప్పున విడుదల చేశామని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు ఇప్పటికే రాష్ట్ర వాటాతో కలిపి 1,500 కోట్లు విడుదల చేయగా.. ఇందులో దాదాపు 1,200 కోట్లు భారత ప్రభుత్వ వాటా అని ఆయన తెలిపారు. అదేవిధంగా 2021-2022 సంవత్సరంలో, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి (SDRF) మొత్తం కేటాయింపు 479.20 కోట్లు ఇందులో కేంద్ర వాటా 359.20 కోట్లు అని ఆయన స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version