భార్యను ఊచకోత కోసి.. నదిలో దూకి చనిపోయాడు..

-

సమాజంలో దారుణాతి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు మృగాల కన్నా మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము ఏం చేస్తున్నామనే విషయం ఏమాత్రం తెలుసుకోకుండా అత్యంత పాశవికంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి తాను నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కేరళలోని పఠనంథిత్త అనే టౌన్‌లో నివాసం ఉండే అట్టచక్కల్‌ వాసి కేఆర్‌ గణనాథన్‌ (67) తన భార్య రమణి (65)ని ఊచకోత కోసి హత్య చేశాడు. అనంతరం ఇంటి నుంచి బయట పడి సమీపంలో ఉన్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నది వైపుకు వెళ్తున్నప్పుడు కొందరు అతన్ని ఆపి ప్రశ్నించగా.. తాను తన భార్యను హత్య చేశానని చెప్పాడు. దీంతో వారు అతని ఇంటికి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అయితే తిరిగి అతని కోసం స్థానికులు గాలింపు చేపట్టగా అతను నదిలో దూకాడని తెలిసింది. ఈ క్రమంలో అతని మృత దేహం కొన్ని గంటలకు ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతను అలా తన భార్యను అత్యంత దారుణంగా ఎందుకు చంపి ఉంటాడో తెలియాల్సి ఉందని, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడో కూడా వివరాలు తెలియాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version