విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి.. 15 ఏళ్ల బాలికతో..!

-

మనిషికి డబ్బు ఉండగానే కాదు.. కాసింత బుద్ధి కూడా ఉండాలి. మంచి బుద్ధి ఉండాలి. అది లేకపోతే.. ఎంత డబ్బు ఉన్నా వేస్ట్. డబ్బు ఉంది కదా అని అహంకారంతో ఏది పడితే అది చేస్తే.. సమాజం చూస్తూ ఊరుకోదు. దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. ఓ వ్యక్తి.. కోటీశ్వరుడు.. కానీ బుద్ధే వంకర.. అందుకే 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తనకు ఉన్న సొంత జెట్‌లో ఎక్కించుకొని.. విమానంలోనే ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి మరీ.. ఆ బాలికపై లైంగిక దాడి చేసిన ఆ ప్రబుద్ధుడికి తాజాగా న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ ఘటన న్యూజెర్సీలో చోటు చేసుకున్నది. స్టీఫెన్ మెల్ అనే ఓ వ్యక్తికి సొంత విమానం ఉంది. ఓ మహిళ.. తన కుమార్తెకు పైలట్‌గా శిక్షణ ఇవ్వాలని అతడి వద్దకు తన 15 ఏళ్ల కూతురును అతడి వద్దకు పంపించింది. దీంతో ఆ బాలికపై కన్నేసిన స్టీఫెన్.. ఓరోజు బాలికను ఒంటరిగా విమానంలో తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడిపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉందట. ఈ కేసులో మాత్రం మనోడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం.. మరో కేసును వచ్చే జులైలో విచారించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version