‘ఇవేం దిక్కుమాలినపనులు’ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు.అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వంటి పనుల ద్వారా ఎంతో మందిని ఆ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి’ అని ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ చేసిన ట్వీట్‌కు ఏపీకి చెందిన ఫిషర్ మ్యాన్, లోకల్ బాయ్ నాని దిగొచ్చాడు.
ఇకమీదట బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేయనని ప్రకటించాడు. తనకు చదువు లేదని, కానీ చదువుకున్న వారు వందల్లో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం దురదృష్టకరమని పేర్కొంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు సజ్జన్నార్ సార్ స్పందించడం వల్లే వదిలేస్తున్నానని చెప్పారు.దీనిపై సజ్జన్నార్ స్పందిస్తూ.. ‘ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్ లైన్ బెట్టింగ్ ను ఇక నుంచి ప్రమోట్ చేయనని నాని ప్రకటించడం అభినందనీయం. మిగతా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు కూడా నాని లాగే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక నుంచైనా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపండి. ‘మేం అలానే చేస్తాం. మా ఇష్టం’ అనుకుంటే మీపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.