ఏపీలో దారుణం.. 9 ఏళ్ల బాలుడిపై పాస్టర్ లైంగికదాడి..!

-

ఏపీ లోని తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది సంవత్సరాల బాలుడు పై ఓ పాస్టర్ లైంగికదాడి చేశాడు. పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడకు చెందిన దంపతులు.. తమ బిడ్డను దేవుని సన్నిధిలో ఉంచితే మంచి జరుగుతుందని భావించారు. దీంతో తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న తమ పిల్లాడిని తెనాలి పట్టణం అయితా నగర్ లోని కల్వరి చర్చి లో గత సంవత్సరం మే 3వ తేదీన వదిలిపెట్టారు.

అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు ఆ బాలుడు. అవసరమైనప్పుడు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇటీవల ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో… ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇంటికి వెళ్లిన దగ్గరనుంచి బాలుడు అనారోగ్యంగా ఉండటంతో… తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో పాస్టర్ ఆహారొన్ ప్రకాష్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలుడు చెప్పాడు. ఈ అమావాస్య సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే తినాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version