నేపాల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ

-

నేడు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ నేపాల్ కు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఖుశీనగర్ కు ఆయన బయలుదేరారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు నరేంద్ర మోడీ. ఖుశీనగర్ లోని గౌతమ బుద్ధుడు మోక్షం పొందాడని ప్రతీతి. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించిన తరువాత ఆయన నేపాల్లోని లుంబినీ కి వెళ్తారు.

లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలం. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. లుంబిని లో బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి మన దేశం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో వారసత్వ కేంద్రం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు ఇరు దేశాల కు సంబంధించిన ఐదు అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. బుద్ధుని బోధనలు ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాయని చెప్పారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version