రియల్‌మీ నుంచి రియల్‌మీ నార్జో 50 5జీ, 50ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఈ నెల 18 లాంచ్ కానున్నాయి. ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లే.. అదిరిపోయే ఫీచర్స్ తో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను ఈ సిరీస్‌లో ఈ ఫోన్లు రానున్నాయి. ఈరోజు మనం ఇందులో ఉన్న ఫీచర్స్, ధర, బ్యాటరీ సామర్థ్యం చూద్దాం.
రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ మొబైల్ మీడియాటెక్ డైమన్సిటీ 920 (MediaTek Dimensity 920) ప్రాసెసర్‌పై రన్ కానుంది. అలాగే హీటింగ్ కంట్రోల్ కోసం 5-లేయర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఇవ్వనున్నారు. అలాగే అంటుటూ (AnTutu) బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో ఈ మొబైల్ 4,96,670 స్కోర్ చేసినట్టు సమాచారం.
రియల్‌మీ నార్జో 50 5జీ స్పెసిఫికేషన్లు..
లీకులు ఆధారంగా…ఈ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ 810 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ల ధర రూ.15 వేలలోపు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
బ్యాటరీ సామర్థ్యం..
4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది.
మే 18వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుంది. కంపెనీ యూట్యూబ్ చానెల్, ఫేస్‌బుక్ పేజీల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తారు. రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్ సైట్, అమెజాన్ ఇండియా సైట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.