పూజలో పెట్టిన డబ్బు మాయం.. కట్ చేస్తే రెండున్నర లక్షలను బాత్రూమ్ కమోడ్ లో వేసి ఫ్లష్ కొట్టేసిన దొంగ

-

దొంగతనం చేశాడు..దొరికిపోయో పరిస్థితి వచ్చేసింది. చేసేదేం లేక ఆ డబ్బును నీళ్లపాలు చేసేశాడు. ఇదేదో సినిమాలో జరిగినట్లు ఉంది కదా.. కానీ నిజంగానే జరిగింది. ఇంట్లో కాటరింగ్ కోసం వచ్చి పూజలో పెట్టిన అక్షరాలు రెండున్నర లక్షలు కాజేశాడు. కట్ చేస్తే ఇంటి యజమానికి డబ్బులు పోయాయని అర్థమైంది. ఇళ్లంతా తనిఖీ చేయటంతో ఆ దొంగ భయంతో డబ్బును తీసుకెళ్లి బాత్రుమ్ కమోడ్ లో వేసి ఫ్లష్ కొట్టాడు. డబ్బులు కాస్తా సెప్టిక్ ట్యాంక్ పాలైంది. అసలూ ఎలా జరిగిందో వివరంగా చూద్దాం..

జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ప్రకాశ్ చంద్ జైన్ దీపావళీకి సంబంధించి ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే పూజలో భాగంగా దేవుడి ముందు మూడున్నర లక్షల రూపాయలను ఉంచాడు. అనంతరం పూజ కార్యక్రామాలు నిర్వహించాడు. ఘనంగా అందరిని పిలిచి భోజనాలు పెట్టేందుకు కేటరింగ్ వారికి ఆర్డర్ ఇచ్చాడు. అయితే పూజా కార్యక్రమాలు అయిన పోయిన తర్వాత అందరికి భోజనాలు వడ్డించారు. ఇలంతా హడావిడిగా ఉంది. ఎవరిపనిలో వాళ్లు ఉన్నారు.

అంతే పూజ ముందు పెట్టిన మూడున్నర లక్షల మీద కేటరింగ్ సప్లై కోసం వచ్చిన షేక్ చాంద్ రజాక్ కన్ను పడింది. ప్రకాశ్ చంద్ జైన్ బయటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరని గమనించిన రజాక్ మూడున్నర లక్షలను దొంగిలించేశాడు… ఇల్లంతా హడావిడిగా ఉంది కదా.డబ్బులు పోయినట్లు అంత త్వరగా ఎవరూ కనిపెట్టరులే..కామ్ కొట్టేసి పోదాం అనుకున్నాడు. కానీ దొంగ ప్లాన్ ఫ్లాప్ అయింది. దీంతో బయటికి వెళ్లి వచ్చిన ప్రకాశ్ జైన్ వెంటనే పూజ ముందు ఉంచిన నోట్ల కట్టలు కనిపించక పోవడంతో కంగారు పడ్డాడు.

అనుమానంతో ఇంట్లో వెతుకున్న ప్రకాశ్ జైన్ అందరిని తనిఖీ చేయటం స్టాట్ చేశాడు. తన జేబులో ఉన్న డబ్బు ఎక్కడ బయటపడుతుందోనని భయంతో వెంటన తన దగ్గర డబ్బులోనుండి రెండున్నర లక్షలను బాత్రుంలోకి వెళ్లి కమోడ్‌లో పడేసి.. ఫ్లష్ కొట్టాడు. అంతే పైసలన్నీ నీళ్లపాల్ అయిపోయాయి. ఇక మిగిలిన డబ్బును తన జేబులో దాచుకున్నాడు. ఈ దొంగ మరీ అమాయకుడిలా ఉన్నాడు..మిగిలిన డబ్బు ఉన్నా దొరికిపోతాననే పాయింట్ ఆ టెన్షన్ లో తట్టనుట్లుంది..అలాగే జరిగింది. అయితే తనిఖీల్లో రజాక్ వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉండటంతో మిగతా డబ్బుల కోసం ఆరా తీశాడు. దీంతోభయమేసిన దొంగ బాత్రుంలో వేశానని చెప్పడంతో .. అక్కడికి వెళ్లి వెతికారు. అయితే అప్పటికే డబ్బంతా లోపలకి వెళ్లిపోయింది. పైన రెండు మూడు నోట్లు తేలియాడుతూ కనిపించాయి. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version