విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెల్లింది ఆర్టీసీ బస్సు. దింతో స్పాట్‌లోనే మహిళ మృతి చెందారు. అటు పలువురికి గాయాలు అయ్యాయి. దింతో ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందట.

దీనిపై విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మాట్లాడారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. డ్రైవర్ కు కొంచెం అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. బస్సు వచ్చే సమయంలో వేగంగా వెళుతున్నట్లు ఎక్కడా కనిపించలేదన్నారు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు. ప్లాట్ ఫామ్ కి వచ్చే ప్రతి బస్సుకు ముందస్తు సూచనలు చేస్తామన్నారు. ప్రయాణికురాలు మృతి చెందడంతో పాటు మరో ప్రయాణికులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు.
విశాఖపట్నం ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి.. #Visakhapatnam #Bus #Accident #CCTV #RTV pic.twitter.com/aOBeJp3JwJ
— RTV (@RTVnewsnetwork) August 11, 2025