బలవంతంగా మద్యం తాగించి.. మహిళపై సామూహిక అత్యాచారం

-

బలవంతంగా మద్యం తాగించి ఓ వివాహితపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 17 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ యువకులు బెదిరించడంతో మహిళ ఇన్నిరోజులు మౌనంగా ఉంది. చివరకు ధైర్యం కూడగట్టుకుని భర్తకు నిజం చెప్పగా.. ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. సెప్టెంబర్ 17వ స్థానిక యువకుడు.. మహిళను తన భర్త పిలుస్తున్నాడని చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version