ప్రేమిస్తున్నానంటూ వివాహితను కిడ్నాప్.. ఆపై అత్యాచారం

-

వివాహితను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువతికి.. లక్కవరం గ్రామానికి చెందిన వ్యక్తితో నెలరోజుల కిందట వివాహమైంది. ఆగస్టు 6న ఆమె భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో యువతికి గతంలో పరిచయమున్న శివకుమార్‌ వచ్చి ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే చనిపోతానని బెదిరించి.. మరో యువకుడి సాయంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని హైదరాబాద్‌ తీసుకెళ్లాడు. తిరిగి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి, పలుమార్లు బలాత్కారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టడంతో పాటు కులంపేరుతో దూషించి ఇంటివద్ద దింపేశాడు.

ఈ ఘటనకు సంబంధించి శివకుమార్‌, మరికొందరిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న రాత్రి శివకుమార్‌ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తాను, యువతి ప్రేమించుకున్నామని, ఆమెకు పెళ్లి ఇష్టం లేదని, ఇద్దరం ఇంటి నుంచి వెళ్లిపోయామన్నారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసి తిరిగి వచ్చామన్నారు. అనంతరం తనపైకేసు పెట్టించారని.. ఓ మధ్యవర్తి కేసు రాజీకి డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version