తెలంగాణలో గ్రూపు-3 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రూపు-3 పరీక్షలకు కేవలం 49 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఇందులో పలు క్వశ్ఛన్స్ కి సరైన ఆప్షన్స్ ఇవ్వలేదని.. క్వశ్చన్ కూడా తప్పు అడిగారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఓ క్వశ్చన్ ఇలాంటి సందేహాలనే వ్యక్తం చేసింది. అది ఏంటంటే..? తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాదికారిక పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి..?
ఆప్షన్స్ పరిశీలించినట్టయితే.. 1. నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం. 2. భారత ఉన్నత వృత్తి, విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం. 3. రూ.500లకే గ్యాస్ సిలిండర్ లభ్యత. 4. తెలంగాణ రోడ్డు రవాణా సంస్త నడుపుతున్న ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం. అనే ఆప్షన్స్ ఇచ్చాడు. వాస్తవానికి రూ.2,500 ఆర్థిక సహాయం అందించకముందే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హామీలు అమలు చేయకున్నా.. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశ్న పెట్టడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.