గాంధీ ఆసుపత్రిలో మరో 160 అదనపు పడకలు

-

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును సీఎస్ పరిశీలించారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు.

అలానే గాంధీ ఆసుపత్రి నందు అందిస్తున్న కోవిడ్ చికిత్స సదుపాయాలను సీఎస్ పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైద్యులను అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను సీఎస్ తనిఖీ చేసారు. ఈ ప్లాంట్ రోజుకు 400 మంది పేషంట్లకు సరిపడ ఆక్సిజన్ 4 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ప్లాంట్ ను ఈ రోజే ప్రారంభించారు.

అలానే ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకై క్లీన్లినేస్ డ్రైవ్ కింద చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్లైన్ పనులను సీఎస్ పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. సీఎస్ వెంట వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, సీపీ అంజనీ కుమార్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version