ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం…సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని పేర్కొన్నారు CS సోమేశ్ కుమార్. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని., భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యమని చెప్పారు. ధరణి పోర్టల్ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి… పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయన్నారు.
ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయి…ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చాము, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలట్ గా ప్రారంభించాం..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని వెల్లడించారు.