ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 22 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబై నగరంలోని డీవై పటీల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ను బెంగళూర్ గెలిచింది. ముందుగా బౌలింగ్ వేయాలని నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి మ్యాచ్ కూడా ఇక్కడే జరగడంతో పాటు ఉష్ణ్రోతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పిచ్ చాలా పొడిగా ఉంది. స్పీడ్ బౌలర్లుకు కాస్త కష్టంగా ఉండే అవకాశం ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వాళ్లు 170 నుంచి 180 పరుగులు చేయవచ్చు. కాగ ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కీలకం కానుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ ల్లో ఓడిన చెన్నై.. ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి తుది జట్లు ఇలా ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు :
రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని ( వికెట్ కీపర్ ), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, సుయాష్ ప్రభుదేసాయి, ఆకాష్ దీప్