CSpace : దేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ ఓటీటీ

-

సినిమాలపై ఎక్కువ అభిమానం ఉన్నవారికి ప్రస్తుతం ఎన్నో ఓటీటీ apps అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సినీ లవర్స్ థియేటర్లో కంటే ఎక్కువ ఈ ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కేరళ ప్రభుత్వం ఓటీటీ రంగంలోకి ప్రవేశించింది.ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ ఓటీటీగా నిలవనుంది. సీస్పేస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు.

ఇండియాలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఓటీటీ అయిన సీస్పేస్ ను కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఎఫ్‌డీసీ) సీస్పేస్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. ఇందులో రూ.75కే సినిమాలు వీక్షించొచ్చు. 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లు రూ.40కి, 30ని.ల ఫిల్మ్ లు రూ.30కి.. ఇలా అందిస్తారు. ప్యానెల్ అనుమతి పొందిన షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలనే ఇందులో స్ట్రీమింగ్ చేస్తారు.లాభాల్లో కొంత చిత్ర పరిశ్రమలో ఉపాధి లేని వారి కోసం వినియోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version