మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేగింది. ఇక ఈ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికల్లో రోజు కో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇక తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
మా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు సి వి ఎల్ నరసింహారావు ప్రకటించారు. మా అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు సి వీ ఎల్ నరసింహా రావు సంచలన ప్రకటన చేశారు. తన వ్యక్తి గత కారణాల కారణంగానే నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు సి వీ ఎల్ నరసింహా రావు చెప్పారు. అయితే…ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికీ ఇస్తారనేదానిపై ఇంకా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా…ఈ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికలు అక్టోబర్ 10 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.