టీఆర్ఎస్ ను భూ స్థాపితం చేసేందుకే హుజురాబాద్ లో గెలుస్తా : ఈటల

-

2023 లో టీఆరెస్ పార్టీ భూ స్థాపితం చేసేందుకు హుజురాబాద్ లో జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.  కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… ఈటల రాజేందర్ కు ఎవరైతే దగ్గరో వారిని బెదిరించి పార్టీ లో కలుపుకుంటున్నారని.. వీణవంక మండల ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప డబ్బులకు కాదన్నారు.

etala

గ్రామాలలో అంగన్వాడీ టీచర్ల ,ఆశవర్కర్ల భర్తలు నా తోటి తిరుగుతే వాళ్ల ఉద్యోగాలు తీసి వేస్తామని బెదిరింపులు గురి చేస్తున్నారని… ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా కోర్కెల్ గ్రామంలో ఫించన్ ఇస్తామని దప్పు చాటింపు చేశారా కానీ ఇప్పుడు ఇస్తుంది ఎందుకో నా ప్రజలు అర్ధం చేసుకోవాలని తెలిపారు. దళిత బందు 10 లక్షలు రూపాయలు కలెక్టర్ల , బ్యాంకర్లకు ప్రమేయం లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వడ్లు కొనాలి అని చెప్పే ఈటెల వైపు ఉంటారా ? వడ్లు కొనలేము అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉంటారా ? అని ప్రశ్నించారు ఈటల. ఈటెల రాజేందర్ గెలవాలను ఒక్క హుజురాబాద్ ప్రజలు కాదు రాష్ట్రం మొత్తం కోరుకుంటుందని వెల్లడించారు. హుజురాబాద్ లో టిఆర్ ఎస్ పార్టీ నాయకుల వల్ల మనుషులను నమ్మే పరిస్థితి లేకుండ పోయిందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version