కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అన్నారా…? ముంచుతారు

-

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడుతున్నాయి. దీనిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందించడానికి గానూ ఇప్పుడు భారీ వ్యవస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ని ఇప్పుడు ప్రజలకు అందించడం అనేది పెద్ద సవాల్ గా మారింది.

ఇందుకోసం దరఖాస్తులు అనే మాట కూడా వినపడింది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ని ఆధారంగా చేసుకుని కొందరు సరికొత్త మోసాలకు దిగడం గమనార్హం. కరోనా వ్యాక్సిన్ పేరిట మోసం… తస్మాత్ జాగ్రత్త !!

కరోనా కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. కరోనా పట్ల ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కరోనా కు వ్యాక్సిన్ రాబోతుందని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి రంగంలోకి దిగారు. ఆధార్ కార్డు, బ్యాంక్, మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ వివరాలను పంపించమని కొంత మంది అమాయకులను టార్గెట్ చేసి వల విసురుతున్నారు.

అడిగిన వివరాలను పంపించగానే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి, దీనితో ప్రజలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ కోరారు. కరోనా వ్యాక్సిన్ కోసమని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మోసమని గ్రహించాలి అని ఆయన సూచించారు. అనుమానం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్ లేదా సైబరాబాద్ సైబర్ క్రైమ్ నంబర్ కంప్లైంట్స్ సెల్ 9490617310 నంబర్ లో సంప్రదించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version