లోన్ యాప్స్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాకు పారిపోయేందుకు యత్నించిన లాంబోని ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు పోలీసులు. 4 కంపెనీల ద్వారా లాంబో లోన్ యాప్స్ నడుపుతున్నట్టు గుర్తించారు. లాంబోకు పూర్తిస్థాయిలో సహకరించిన నాగరాజుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూల్‌కు చెందిన నాగరాజును కూడా ఢిల్లీలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. 6 నెలల కాలంలో రూ.21 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 150 యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపిన లాంబో ఇండియా నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నిధుల మళ్లింపు చేసినట్టు సీసీఎస్ ఆరా తీసింది. వేల కోట్ల నిధుల మళ్లింపుపై కేంద్రానికి సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దేశం మొత్తాన్ని టెన్షన్ పెడుతోన్న ఈ లోన్ యాప్స్ అంశాన్ని హైదరబాద్ పోలీసులు సమర్ధ వంతంగా క్రాక్ చేశారని చెప్పచ్చు.