ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి.. శుభాకాంక్షలు చెప్పిన సోము వీర్రాజు

-

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ అధిష్టానం ఇవాళ నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ప్లస్ అయ్యాయి. పురంధేశ్వరితో పోలిస్తే ఆమెతో ఈ రేసులో నిలిచిన సత్యకుమార్, సుజనా చౌదరి వంటి వారు ఆయా అంశాల్లో ఆమెతో పోటీ పడే పరిస్ధితి లేదు.

అయితే.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురంధేశ్వరికి అక్కడి బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వివిధ స్థాయిల్లో బీజేపీకి ఆమె సేవలందించారని పురంధేశ్వరిని కొనియాడారు. ఆమె అపార రాజకీయ అనుభవం ఏపీలో పార్టీ విస్తరణ, బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ నేషనల్ ఎగ్జిగ్యూటివ్ సభ్యుడిగా ఎంపికైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సోమువీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version