కారు ఎక్కేముందు టాయిలెట్‌కు వెళ్లాల్సిందే లేదంటే ప్రాణాలకే ప్రమాదమట..!

-

జనరల్‌గా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇక మొత్తం అయిపోయింది తాళం వేయడమే అన్నప్పుడు కచ్చితంగా టాయిలెట్‌కు వెళ్తాం. మళ్లీ బయట ఎలా ఉంటుందో, వీలు ఉంటుందో లేదో అని. ముఖ్యంగా బస్‌ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఇలానే చేస్తారు. అయితే మన సొంత కారు అయితే పెద్దగా ఆలోచించరు. ఎక్కడైనా ఆపేసి వెళ్లొచ్చులే అనుకుంటారు. అబ్బాయిలు ఇదే చేస్తారు. కానీ కారు ఎక్కే ముందు కచ్చితంగా మూత్రానికి వెళ్లాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అంట.. ఇది మరీ విడ్డూరంగా ఉంది అనుకుంటున్నారు. అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..

మీరు కారులో సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి. ఆ తర్వాతే కారులో కూర్చోవాలి. మార్గ మధ్యలో కానిద్దాంలే అని వాయిదా వేయొద్దు. అలాగే ప్రయాణం మధ్యంలో టాయిలెట్ వచ్చినా కారు ఆపి పని కానిచ్చేయడం బెటర్. ఎందుకంటే మూత్రం లేదా మలాన్ని ఉగ్గబెట్టుకుని ఆపకోవడం వల్ల మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ సమయంలో మీరు కారు ప్రమాదంలో చిక్కుకుంటే మీరు చనిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంట్రాపెరిటోనియల్ అనే పొత్తికడుపు గోడలో చీలిక ఏర్పడుతుంది. అది పగిలితే బాధితుడు వెంటనే చనిపోతాడట. మూత్రాశయం ఖాళీగా ఉన్నట్లయితే అది చిట్లిపోయే అవకాశం తక్కువ అని వైద్య నిపుణులు అంటున్నారు.

పెల్విక్ ఫ్లోర్ నిపుణులు కూడా గతంలో మూత్రాన్ని ఉగ్గబెట్టుకుని ఉంచుకోవడంపై హెచ్చరించారు. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుని ఉంచడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రెండు రకాలుగా దీని నుంచి ముప్పు ఉంది. నిత్యం సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యం బస్సుల్లో ప్రయాణించేవారు కూడా మూత్రం విసర్జన తర్వాతే ప్రయాణం చేయడం బెటర్. రైళ్ల తరహాలో బస్సులో టాయిలెట్స్ ఉండవు కాబట్టి దీన్ని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి.

సో.. అది మ్యాటర్‌. ప్రయాణంలో ఉన్నప్పుడు టాయిలెట్‌ను హోల్డ్‌ చేసుకున్నప్పుడు అప్పుడే మనకు ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోయే అవకాశం రెట్టింపు అవుతుందనమాట.! కాబట్టి ఎప్పుడూ టాయిలెట్‌ను ఆపుకోకండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version