మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్రానికి వ్యతిరేఖంగా నిలబడే ధైర్యం కేసీఆర్ కు లేదని విమర్శించారు. దేశంలోనే మోస్ట్ కరెప్టెడ్ సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజనర్సింహ. తెలంగాణలో 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో వారికే తెలియాలని కేంద్రం తీరును తప్పుబట్టారు.
కేసీఆర్ పై దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు… మోస్ట్ కరెప్టెడ్ సీఎం కేసీఆర్ అంటూ…
-