బండి సంజయ్ మాడి మసై పోతాడు : గంగుల సంచలనం

-

కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శికండి రాజకీయాలు చేశారని… శికండి రాజకీయాలు చేసినవారు మాడి మసైపోతారని హెచ్చరించారు.

మా పార్టీ ప్రజా ప్రతినిధులు 986 ఓట్లు…ఉన్నాయి…ఒక్క ఓటు తగ్గిన బాధ్యత వహిస్తాయన్నారు.. క్రాస్ ఓటింగ్ ఓ భ్రమ అని… క్యాంప్ కాదు …నాయకుల్ని కాపాడుకోవడం నాయకత్వ బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాలను గౌరవిస్తాం…కండువాలుంటే అనుమతించకండన్నారు. కరీంనగర్ లోని బీజేపీ 14 ఓట్లు బీజేపీ కి కనీసం పడుతాయా చూసుకోండి ? అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు మంత్రి గంగుల. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది.. కేవలం టిఆర్ఎస్ సర్కార్ అని పేర్కొన్నారు. కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ అడ్డా అని.. తమ గెలుపును ఎవరూ అపలేరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version