రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ..న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు. ఇక పీఏసీ పదవిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.గతంలో కాంగ్రెస్‌కు కాకుండా అధికార బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీకి పీఏసీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.అసలు పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదన్నారు. ఇలాంటి వాటిపై మాట్లాడేముందు బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది.4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని..లేనియెడల తాము సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరుపుతామని తీర్పు చెప్పింది.కాగా,ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లు ఉన్న విషయం తెలిసిందే.