మునుగోడుతో డేంజర్..దుబ్బాక-హుజూరాబాద్ కాదు.!

-

ఎలాంటి అంచనాలు లేకుండా..సర్వేలు చేసుకోకుండా…పరిస్తితులని తెలుసుకోకుండా బీజేపీ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మునుగోడు బరిలో నిలబెట్టిందని అనుకోవడానికి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ…తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది…పైగా రాజకీయ జిమ్మిక్కుల్లో ఆరితేరి ఉన్న కేసీఆర్‌ని ఎదురుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఆచి తూచి రాజకీయం చేస్తారని అనుకోవచ్చు.

పక్కా ప్లాన్ ప్రకారమే ఏ మాత్రం బలం లేని మునుగోడులో కోమటిరెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికలో బరిలో నిలబెట్టి ఉంటారు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పొచ్చు. మునుగోడులో గెలిచి…ఒకేసారి ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలనే టార్గెట్ బీజేపీ పెట్టుకుని ఉంటుంది. అయితే మునుగోడులో గెలుపు దిశగానే బీజేపీ వెళుతుంది…కాంగ్రెస్ శ్రేణులు కొంత బీజేపీలోకి వచ్చాయి…అలాగే కోమటిరెడ్డికి బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇక టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కలిసొస్తాయి. ఇవన్నీ చూసుకునే బీజేపీ బరిలో దిగుతుంది.

అయితే ఇక్కడ గెలుపు ఒక్కటే ఆప్షన్ ఉందని అనుకోవడానికి లేదు…మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది..2014 ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ గెలిచింది. అప్పటివరకు టీడీపీ-కమ్యూనిస్టులకు ఉన్న కేడర్ టీఆర్ఎస్ వైపు వచ్చింది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతంగా బలం వచ్చింది. ఇప్పటికీ అక్కడ పార్టీకి బలం ఉంది..అలాగే కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్లు చీలితే టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అవుతుంది. ఇక అధికార బలం ఎలాగో ఉంది.

అటు కాంగ్రెస్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా మునుగోడు కాదు…బీజేపీ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఓడితే టీఆర్ఎస్ పార్టీకి ఊపు వస్తుంది. ఇక ఇక్కడ ఇంకో ఇబ్బంది ఉంది…రెండోస్థానం కూడా కాకుండా మూడో స్థానానికి గాని పరిమితమైతే బీజేపీకి రాజకీయంగా చాలా ఇబ్బంది వస్తుంది…కాబట్టి మునుగోడులో బీజేపీ ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉంటూ ముందుకెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version